డాన్స్ తో దుమ్మురేపేసిన రామ్ .. 'స్కంద' నుంచి లిరికల్ వీడియో రిలీజ్!
- బోయపాటి నుంచి వస్తున్న 'స్కంద'
- ఫస్టు టైమ్ రామ్ జోడీకట్టిన శ్రీలీల
- సంగీతాన్ని అందించిన తమన్
- సెప్టెంబర్ 15వ తేదీన ఐదు భాషల్లో విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. "నీ చుట్టు చుట్టు చుట్టు చుట్టు తిరిగినా .. నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా, నా దిమ్మదిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతుందిగా" అంటూ ఈ పాట సాగుతోంది. రామ్ - శ్రీలీల జోడీపై ఖరీదైన సెట్లో కలర్ ఫుల్ గా ఈ పాటను చిత్రీకరించారు.
తమన్ స్వరపరచిన ఈ బాణీకి రఘురామ్ సాహిత్యాన్ని అందించాడు. సిద్ శ్రీరామ్ - సంజన ఆలపించారు. యూత్ కి కనెక్ట్ అయ్యే బీట్ తో .. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీతో ఈ పాట ఆకట్టుకుంటోంది. రామ్ మరోసారి డాన్స్ పరంగా మరిన్ని మార్కులు కొట్టేసే పాట ఇది. ఆయనకి ఇది ఫస్టు పాన్ ఇండియా మూవీ, 'అఖండ' తరువాత బోయపాటి నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి మరి!