బీజేపీలో చేరేందుకు ఇంద్రకరణ్ ప్రయత్నాలు చేస్తున్నారు: మహేశ్వర్ రెడ్డి
- ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని వెల్లడి
- ఇంద్రకరణ్ బీజేపీలో చేరితే ముథోల్ టిక్కెట్ ఇప్పిస్తానన్న మహేశ్వరరెడ్డి
- ఎన్నికల్లో ఓటమిని తప్పించుకోవడానికి దారులు వెతుక్కుంటున్నారని వ్యాఖ్య
ఇందుకు సంబంధించి తన వద్ద రుజువులు ఉన్నాయని, ఇంద్రకరణ్ కనుక బీజేపీలో చేరితే ముథోల్ టిక్కెట్ ఇప్పిస్తామని వ్యాఖ్యానించారు. అంతేకానీ, అనవసరంగా ఇతరులపై విమర్శలు సరికాదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఓటమి ఖాయమని, దీని నుండి తప్పించుకోవడానికి ఆయన దారులు వెతుకుతున్నారన్నారు.