రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు కన్నుమూత
- వయోభారంతో బుధవారం హైదరాబాద్లో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే
- సఖినేటిపల్లిలోని స్వగృహానికి మృతదేహం తరలింపు
- గురువారం మధ్యాహ్నం సోంపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు
అనంతరం, 2004లో మళ్లీ బరిలోకి దిగి సత్యనారాయణరాజుపై విజయం సాధించారు. అల్లూరి కృష్ణంరాజు భార్య ప్రస్తుతం టీటీడీ పాలకవర్గ సభ్యురాలిగా ఉన్నారు. ఆ దంపతులకు కుమారుడు శ్రీనివాసరాజు, కుమార్తెలు కృష్ణకుమారి, విజయ ఉన్నారు. శ్రీనివాసరాజు వ్యాపార, పారిశ్రామిక రంగంలో స్థిరపడ్డారు.
కృష్ణంరాజు భౌతిక కాయాన్ని గురువారం సఖినేటిపల్లిలోని ఆయన నివాసానికి తీసుకురానున్నారు. మధ్యాహ్నం సోంపల్లిలోని శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు.