'ఆదిపురుష్'కు సీత కష్టాలు... నేపాల్ లో ప్రదర్శనకు అనుమతి నిరాకరణ!
- ఈరోజు ఘనంగా విడుదలైన 'ఆదిపురుష్'
- సీతాదేవి భారత్ లో పుట్టినట్టుగా సినిమాలో సన్నివేశం
- సీత తమ దేశంలో పుట్టిందంటూ నేపాల్ అభ్యంతరం
ఈ సినిమాలో సీతాదేవి భారతదేశపు కుమార్తె అనే డైలాగ్ చెప్పేలా సన్నివేశం ఉంది. అయితే, సీతాదేవి నేపాల్ లో జన్మించిందనేది ఆ దేశ ప్రజల నమ్మకం. ఇదే వివాదానికి కారణం అయింది. సీతాదేవి భారత్ లో పుట్టినట్టుగా ఉన్న డైలాగ్ ను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సినిమాను ప్రదర్శించనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషించగా, సీతామాత పాత్రలో కృతి సనన్ నటించారు.