తెలుగు తెరపైకి మరో హాట్ బ్యూటీ!
- నాగశౌర్య తాజా చిత్రంగా రూపొందిన 'రంగబలి'
- కథానాయికగా యుక్తి తరేజా పరిచయం
- సంగీతాన్ని సమకూర్చిన పవన్ సీహెచ్
- జూన్ 7వ తేదీన సినిమా విడుదల
నాగశౌర్య హీరోగా 'రంగబలి' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కథానాయికగా యుక్తి తరేజా నటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ, తనకి మంచి పేరు తీసుకొస్తుందని యుక్తి తరేజా భావిస్తోంది.
పవన్ సి హెచ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. జూన్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొంత కాలంగా నాగశౌర్య వరుస ఫ్లాపులతో సతమవుతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి. ఇక యుక్తి తరేజా కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.