సాయిపల్లవి న్యూ మూవీ లాంచ్!
- కమల్ సొంత బ్యానర్లో మరో సినిమా
- ఈ రోజునే చెన్నైలో మొదలైన సినిమా
- శివకార్తికేయన్ జోడీగా సాయిపల్లవి
- దర్శకత్వం వహిస్తున్న రాజ్ కుమార్
తెలుగులో ఈ మధ్య కాలంలో సాయిపల్లవి చేసిన 'లవ్ స్టోరీ'.. 'శ్యామ్ సింగ రాయ్' భారీ విజయాలను అందుకున్నాయి. 'విరాటపర్వం' సినిమా కూడా ఆమెకి ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె చేయనున్న తెలుగు సినిమా ఏమిటా అని అభిమానులు వెయిట్ చేస్తూ ఉండగా, ఆమె ఒక తమిళ సినిమాను అంగీకరించింది.
శివకార్తికేయన్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. కెరియర్ పరంగా శివ కార్తికేయన్ కి ఇది 21వ సినిమా. ఈ సినిమా కమల హాసన్ సొంత బ్యానర్ లో నిర్మితమవుతూ ఉండటం విశేషం. కమల్ క్లాప్ తో ఈ రోజునే చెన్నైలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.