బాధ్యత గల వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలి: హరీశ్ రావుపై బొత్స ఫైర్
- ఏపీ అభివృద్ధిపై మాట్లాడేందుకు ఆయనెవరన్న బొత్స
- ముందు తమ రాష్ట్రం గురించి చూసుకోవాలంటూ హరీశ్‌రావుకు హితవు
- ఏపీ ప్రజలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అందరికీ తెలుసన్న ఏపీ మంత్రి
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం బిడ్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయ వైరానికి కారణమైంది. దీనికితోడు హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని ఏపీ ప్రజలు సొంతం రాష్ట్రంలో ఓటు హక్కు వదులుకుని తెలంగాణలో తీసుకోవాలని కోరారు. హరీశ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. దీనికి హరీశ్ కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు.