'రామబాణం' నుంచి జానపద బాణీలో హుషారెత్తించే మాస్ బీట్!
- గోపీచంద్ తాజా చిత్రంగా 'రామబాణం'
- కథానాయికగా డింపుల్ హయతి సందడి
- అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో నడిచే కథ
- మే 5వ తేదీన భారీస్థాయిలో విడుదల
యాక్షన్ తో పాటు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'ఐ ఫోన్' సాంగ్ ను రిలీజ్ చేశారు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, రామ్ మిర్యాల - మోహన భోగరాజు ఆలపించారు. జానపద బాణీలో .. మాస్ బీట్ తో ఈ పాట సందడి చేస్తోంది.
గోపీచంద్ జోడీగా డింపుల్ హయతి అలరించనున్న ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించారు. మే 5వ తేదీన ఈ సినిమాను భారీస్దాయిలో రిలీజ్ చేయనున్నారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్ కి, ఈ సినిమాతో ఊరట లభిస్తుందేమో చూడాలి.