‘ఏంటమ్మా’ సాంగులో డాన్స్ చేయడంపై చరణ్ రియాక్షన్!
- సల్మాన్ తాజా చిత్రంగా 'కిసీ కా భాయ్ కిసీకి జాన్'
- 'ఏంటమ్మా' పాటలో సల్మాన్ .. వెంకీలతో మెరిసిన చరణ్
- ఈ పాటకి దక్కుతున్న అనూహ్యమైన రెస్పాన్స్
- ఈ నెల 21వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఈ సాంగ్‌కు సంబంధించిన బీటీఎస్ వీడియో (సన్నివేశాల చిత్రీకరణ మధ్యలో ఏం జరిగిందనేది తెలియజేసే వీడియో)ను గురువారం (ఏప్రిల్ 6) రిలీజ్ చేశారు. జాతీయస్థాయిలో తుపానులా ప్రభంజనాన్ని సృష్టించిన పాట గురించి, చరణ్ మనసులో మాటను తెలియజేశాడు. 'ఏంటమ్మా ' సాంగ్‌ను చేసేటప్పుడు తెగ ఎంజాయ్ చేశానని, అందరం కలిసి అదర గొట్టేశామని అన్నాడు.
ఇద్దరు పెద్ద స్టార్ హీరోలతో కలిసి 'ఏంటమ్మా' సాంగ్‌లో నటించటం కల నిజమైనట్లుగా ఉందని, మరచిపోలేని అనుభూతి అని చెబుతూ, ఈ పాటను వెండితెరపై చూసినప్పుడు ఫ్యాన్స్‌కి పండగలా ఉంటుందని చెప్పాడు. 'ఏంటమ్మా' సాంగ్‌కు పాయల్ దేవ్ సంగీత సారథ్యం వహించగా, ఆయనతో పాటు విశాల్ డడ్లాని, రఫ్లార్ ఆలపించారు. షబీర్ అహ్మద్ సాహిత్యాన్ని అందించగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రం 'ఈద్' సందర్భంగా ఈ నెల 21న రిలీజ్ అవుతుంది.