కృష్ణచైతన్య దర్శకత్వంలో విష్వక్సేన్ కొత్త చిత్రం
- సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ నిర్మాణంలో సినిమా
- సరికొత్త పాత్రలో కనిపించనున్న విష్వక్
- దాస్ కా ధమ్కీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యువ హీరో
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. సినిమా గురించి ప్రకటన వీడియో ప్రకారం ఈ చిత్రంలో విష్వక్సేన్ మునుపెన్నడూ లేని మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇచ్చిపడేద్దాం అనే క్యాప్షన్ తో విష్వక్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ఈ ప్రపంచంలో బ్లాక్ అండ్ వైట్ అనేవి ఉండవు. ఉండేది గ్రే మాత్రమే. మాస్ కా దాస్ టర్న్స్ బ్యాడ్ అనే క్యాప్షన్స్ తో సాగే వీడియోకు యువన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది.