ఆర్ఆర్ఆర్ చిత్రానికి మరో రెండు విదేశీ అవార్డులు
- అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ కు గుర్తింపు
- ఇప్పటికే పలు అవార్డులు కైవసం
- ఆస్కార్ బరిలో ఉన్న నాటు నాటు పాట
- తాజాగా హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డులు
తాజాగా, మరో రెండు విదేశీ అవార్డులు కూడా ఆర్ఆర్ఆర్ ను వరించాయి. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం కూడా ఈ చిత్రానికే దక్కింది. ఇప్పటికే ఆస్కార్ బరిలో ఉన్న నాటు నాటు పాట హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీని కూడా ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలో, ఇప్పుడందరి దృష్టి మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమంపైనే ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ ఖాయమని చిత్రబృందంతో పాటు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.