రేపే 'సార్' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. వేదిక ఎక్కడంటే ..!
- ధనుశ్ హీరోగా రూపొందిన 'సార్'
- విద్యా వ్యవస్థ నేపథ్యంలో నడిచే కథ
- జీవీ ప్రకాశ్ కుమార్ బాణీలకు మంచి మార్కులు
- ఈ నెల 17వ తేదీన సినిమా రిలీజ్
ఈ సినిమాలో ధనుశ్ లెక్చరర్ గా నటించాడు .. అదే కాలేజ్ పనిచేసే మీనాక్షి పాత్రలో సంయుక్త మీనన్ కనిపించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును రేపు హైదరాబాద్ .. నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను వదిలారు.
ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళంలో 'వాతి' టైటిల్ తో ఈ సినిమా థియేటర్లకు రానుంది.