ఆరోజు నా ప్యాంటులో ఎలుక దూరింది.. ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టిన బిగ్ బీ
- ‘దో ఔరో దో పాంచ్’ సినిమా విడుదలై 43 ఏళ్లు
- సోషల్ మీడియాలో నాటి విషయాలు పంచుకున్న బిగ్ బీ
- సినిమా చూస్తుండగా తన ప్యాంటులో ఎలుక దూరిందన్న అమితాబ్
ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వచ్చింది. అమితాబ్ బచ్చన్ బెల్‌బాటమ్ లుక్స్‌ను గుర్తు చేసుకున్న నెటిజన్లు ఆ రోజుల్లో ఆయన స్టైల్ వేరే లెవెల్లో ఉండేదంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ‘‘నాటి నుంచీ నేటి దాకా మీలో ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదు’’ అంటూ మరికొందరు బిగ్ బీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక 1980లో విడుదలైన ఈ చిత్రంలో హేమమాలిని, ఖదీర్ ఖాన్, ఓం ప్రకాశ్, శ్రీరామ్ లగూ తదితరులు నటించారు. ఈ మూవీకి రాకేశ్ కుమార్ దర్శకత్వం వహించగా సాండో ఎమ్ఎమ్ఏ చిన్నప్ప తేవర్ నిర్మించారు. కళారంగానికి బిగ్ బీ చేసిన సేవకు గాను భారత ప్రభుత్వం ఆయనను 2015లో పద్మ విభూషణ్‌తో సత్కరించిన విషయం తెలిసిందే.