శబరిమలలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చిన మకరజ్యోతి
- శబరిమలకు విచ్చేసిన లక్షలాది భక్తులు
- పొన్నంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనం
- మూడుసార్లు కనిపించిన మకర విళక్కు
- అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయిన శబరిగిరులు
ప్రతి ఏడాది మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల క్షేత్రం వద్ద పొన్నంబలమేడు పర్వతంపై మకరజ్యోతి మూడు సార్లు దర్శనమిస్తుంది. అయ్యప్ప ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పొన్నంబలమేడు కొండ ఉంటుంది. అయ్యప్ప దీక్షలు చేపట్టిన భక్తులు మకరవిళక్కును దర్శించడాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు.