అంజలి రోడ్డు ప్రమాదం కేసు.. వెలుగులోకి కొత్త కోణం!
- ఈ నెల 1న ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అంజలి
- 2020లో తెలంగాణ నుంచి ఢిల్లీకి 30 కేజీల గంజాయి తీసుకెళ్తూ దొరికిన నిధి
- ప్రస్తుతం బెయిలుపై ఉన్నట్టు పోలీసుల వెల్లడి
అంజలిని కారు ఈడ్చుకెళ్తున్న వీడియో, హోటల్ బయట అంజలి, నిధి గొడవ పడుతున్న వీడియోలు బయటకొచ్చి వైరల్ అయ్యాయి. ఘటన జరిగిన రోజు అంజలి మద్యం తాగినట్టు నిధి చెప్పగా, పోస్టుమార్టం రిపోర్టులో అలాంటి విషయాలేవీ వెల్లడి కాలేదు. తాజాగా, నిధికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగు చూసింది. డిసెంబరు 2020లో నిధి తెలంగాణ నుంచి ఢిల్లీకి 30 కేజీల గంజాయి రవాణా చేస్తూ ఆగ్రా రైల్వే స్టేషన్లో పట్టుబడింది. ఈ కేసులో నిధి ప్రస్తుతం బెయిలుపై ఉన్నట్టు పోలీసులు తెలిపారు.