ఏకధాటిగా 60 రోజులపాటు షూటింగులో పాల్గొననున్న మహేశ్ బాబు!
- మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు
- త్వరలో మొదలుకానున్న షూటింగు
- ఉగాది రోజున రానున్న ఫస్టు అప్ డేట్
- ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన
అయితే కొంతకాలంగా మహేశ్ బాబు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ వస్తున్నాడనేది తెలిసిందే. అందువలన ఈ సినిమా షూటింగు వాయిదా పడుతూ వెళుతోంది. ఇక త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఆగస్టులో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని చెబుతున్నారు.
ఇక ఈ సినిమా కోసం ఒక మేజర్ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా వినికిడి. ఈ షెడ్యూల్ షూటింగు నాన్ స్టాప్ గా 60 రోజుల పాటు జరుగుతుందట. సినిమాకి సంబంధించిన ఫస్టు అప్ డేట్ ఉగాదికి ఇస్తారని టాక్. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే.