తల్లి కాబోతున్న సినీ నటి పూర్ణ
- దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తను పెళ్లాడిన పూర్ణ
- అక్టోబర్ 24న దుబాయ్ లో జరిగిన వివాహం
- శుభాకాంక్షలు తెలియజేస్తున్న అభిమానులు
దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ అలీని పూర్ణ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 24న దుబాయ్ లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మరోవైపు తల్లి కాబోతున్న పూర్ణకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. కేరళకు చెందిన పూర్ణ తెలుగులో పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించింది. పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం ఆమె దుబాయ్ లో ఉంటోంది.