ఈ స్థాయిలో పవన్ ఫైట్స్ చేయడం ఇంతకుముందు చూసుండరు: నిర్మాత ఎ.ఎమ్.రత్నం
- 'హరిహర వీరమల్లు'గా పవన్ కల్యాణ్
- నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎ.ఎమ్. రత్నం
- ఇది పాన్ ఇండియా రేంజ్ సినిమా అని వ్యాఖ్య
- సంచలనం సృష్టించడం ఖాయమని వెల్లడి
తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి ఎ.ఎమ్. రత్నం మాట్లాడుతూ .. " కొన్ని కథలు పాన్ ఇండియా లక్షణాలను కలిగి ఉంటాయి .. అలాంటి కథనే ఇది. సబ్జెక్ట్ డిమాండ్ చేయడం వల్లనే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాము. సౌత్ లో కంటే నార్త్ లోనే ఈ సినిమా ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందనే నమ్మకం బలంగా ఉంది" అన్నారు.
"పవన్ కల్యాణ్ గారిపై రీసెంట్ గా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశాము .. అది చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా హైలైట్స్ లో అది ఒకటిగా నిలుస్తుంది. పవన్ కల్యాణ్ గారు ఈ స్థాయిలో ఫైట్స్ చేయడం ఇంతకుముందు చూసుండరు. సినిమా చూసిన తరువాత పవన్ ఫ్యాన్స్ కూడా ఇదే మాట అంటారు. ఈ సినిమా మరో సంచలనాన్ని సృష్టించడం ఖాయం" అంటూ చెప్పుకొచ్చారు.
.