ఈ సినిమాను మీ కూతురుతో కలిసి చూడండి: షారుఖ్ ఖాన్ కు మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సవాల్
- షారుఖ్, దీపికల కాంబినేషన్లో 'పఠాన్' మూవీ
- జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా
- కాషాయ బికినీలో దీపిక నటించడంపై తీవ్ర విమర్శలు
ఈ క్రమంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ స్పందించారు. షారుఖ్ ఖాన్ ఆయన కుమార్తెతో కలిసి ఈ సినిమా చూడాలని సవాల్ విసిరారు. కూతురితో కలిసి సినిమాను చూసినట్టు ప్రపంచానికి తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాలని అన్నారు. ఇలాంటి సినిమానే మహమ్మద్ ప్రవక్తపై తీయగలరా? అని ప్రశ్నించారు.