'పుష్ప' నుంచి రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ రిలీజ్!
- క్రితం ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పుష్ప'
- విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం
- తాజాగా రష్యన్ లాంగ్వేజ్ లోకి అనువాదమైన సినిమా
- డిసెంబర్ 8వ తేదీన రష్యాలో విడుదల
తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమా, వసూళ్ల పరంగా దూసుకుపోయింది. అలాంటి ఈ సినిమాను రష్యన్ భాషలోకి డబ్ చేశారు. కొంతకాలంగా అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూ వచ్చాయి. రష్యాలో డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రిలీజ్ కి ముందు రష్యాలోని ప్రముఖ నగరాల్లో ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నారు.
రష్యన్ వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ను బట్టి చూస్తే, డబ్బింగ్ విషయంలో గట్టిగానే శ్రద్ధ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయా పాత్రల మేనరిజమ్స్ రష్యన్ భాషలోను బాగానే వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తోంది. ఇక రష్యాలో ఈ సినిమా ఏ స్థాయిలో జెండా ఎగరేస్తుందో చూడాలి.