రాజమౌళి ముఖ్య అతిథిగా 'హిట్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్!
- మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నడిచే 'హిట్ 2'
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడివి శేష్
- కథానాయికగా నటించిన మీనాక్షి చౌదరి
- ఈ నెల 28వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
- డిసెంబర్ 2వ తేదీన విడుదల కానున్న సినిమా
డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగానే చెప్పారు. ముఖ్య అతిథి ఎవరనే విషయాన్ని సస్పెన్స్ లో ఉంచారు. తాజాగా సస్పెన్స్ కి తెరదించేస్తూ, చీఫ్ గెస్టుగా రాజమౌళి రానున్నారనే విషయాన్ని ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.
ఈ నెల 28వ తేదీన హైదరాబాదు - ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుక జరగనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. రాజమౌళితో నానికి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన నాని ఆహ్వానం మేరకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడన్న మాట. ఈ సినిమాలో అడివి శేష్ సరసన నాయికగా మీనాక్షి చౌదరి నటించింది
.