సాయిపల్లవి చేతుల మీదుగా 'ఆకాశం' సాంగ్ రిలీజ్!
- విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'ఆకాశం'
- హీరోగా అశోక్ సెల్వన్ పరిచయం
- ఆకట్టుకునే ట్యూన్ ను అందించిన గోపీసుందర్
- అందంగా సాగిన అర్థవంతమైన సాహిత్యం
- ఈ నెల 4వ తేదీన సినిమా విడుదల
ముగ్గురు కథానాయికలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సాయిపల్లవి చేతుల మీదుగా ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేయించారు. 'ఊపిరే హాయిగా .. మారెనే పదాలుగా, ఊహాలే తీయగా .. మారెనే నిజాలుగా' అంటూ ఈ పాట సాగుతోంది.
అశోక్ సెల్వన్ - శివాత్మికపై రొమాంటిక్ గా ఈ పాటను చిత్రీకరించారు. గోపీసుందర్ అందించిన ట్యూన్ ఆహ్లాదకరంగా ఉంది. తేలికైన పదాలతో .. అర్థవంతమైన సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకుంటోంది. ఫీల్ తో సాగిన ఆలాపన ఈ పాటకు ప్రాణం పోసింది. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి.