టీచరుగా మారిన వైసీపీ ఎమ్మెల్యే... ఫొటోలు ఇవిగో
- చంద్రగిరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చెవిరెడ్డి
- పాకాల మండలం రమణయ్యగారి పల్లి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే
- విద్యార్థులకు పాఠం చెప్పిన వైనం
తాజాగా శుక్రవారం చెవిరెడ్డి ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. తన నియోజకవర్గ పరిధిలోని పాకాల మండలం రమణయ్యగారి పల్లి గ్రామం వెళ్లిన చెవిరెడ్డి... గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. ఓ తరగతి గదికి వెళ్లిన చెవిరెడ్డి అక్కడి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఓ తర్ఫీదు పొందిన ఉపాధ్యాయుడి మాదిరగా చాక్‌పీస్ తీసుకుని బ్లాక్ బోర్డుపై అక్షరాలు రాస్తూ ఆయన చెప్పిన పాఠాన్ని విద్యార్థులు ఆసక్తిగా విన్నారు.