పూరిని తిట్టే హక్కు నాకు ఉంది .. నన్ను కొట్టే హక్కు ఆయనకి ఉంది: బండ్ల గణేశ్
- తాజా ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్
- ఎన్టీఆర్ కోసం ప్రాణం ఇస్తానంటూ వ్యాఖ్య
- పూరితో 30 ఏళ్ల అనుబంధం ఉందని వెల్లడి
- ఆయనకి మంచి - చెడు చెప్పే రైట్ తనకి ఉందంటూ వివరణ
ఇక ఎన్టీఆర్ ను నేను అభినందించడం తప్పు ఎలా అవుతుంది? ఆయన అభిమానులు ఫీలవుతున్నారని ఆ ట్వీట్ పెట్టాను. ఎన్టీఆర్ నా హీరో .. ఆయన పట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. నా ప్రాణం పోయినా ఎన్టీఆర్ ను నేను కామెంట్ చేయను. ఆయనతో రెండు సినిమాలు చేశాను. ఒకటి సూపర్ హిట్ అయితే ... మరొకటి బ్లాక్ బస్టర్. నేను మెగా ఫ్యామిలీకి దగ్గర .. ఎన్టీఆర్ కి దూరం అనేది పుకారు మాత్రమే. నేను పూరి విషయంలో జోక్యం చేసుకుంటే ఆయన 'నాలుక జాగ్రత్తగా పెట్టుకో' అంటూ వార్నింగ్ ఇచ్చారనేది అబద్ధమని అన్నాడు.
పూరి నాకు వార్నింగ్ ఇచ్చిన ఆధారం చూపించండి. ఆయినా పూరి గురించి నేనేమీ తప్పుగా మాట్లాడలేదే. భార్యా పిల్లలను ప్రేమించలేనివాడు మనిషేనా? పూరి అనేవాడికి మంచి - చెడు చెప్పే రైట్ నాకు ఉంది .. నా ఫ్రెండ్. మా ఇద్దరి మధ్య 30 ఏళ్ల బంధం ఉంది. ఆయనను తిట్టేహక్కు నాకు ఉంది .. నన్ను కొట్టేహక్కు ఆయనకి ఉంది" అంటూ చెప్పు కొచ్చాడు.