అమరావతి రైతుల పాదయాత్రపై దాడి చేస్తే.. బీజేపీ గట్టిగా ఎదుర్కొంటుంది: సత్యకుమార్
- అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెపుతున్నారు
- ఇంత పేర్ల పిచ్చి ఉన్న పార్టీని నేను ఎప్పుడూ చూడలేదు
- అభివృద్ధి అంటే పేర్లు మార్చడం కాదు
అమరావతి రైతులను బీజేపీ కంటికి రెప్పలా కాపాడుతుందని... పాదయాత్ర సందర్భంగా రైతులపై దాడి జరిగితే... బీజేపీ గట్టిగా ఎదుర్కొంటుందని చెప్పారు. మూడున్నరేళ్లలో ఏం చేశారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని... పైగా, జూట్ మిల్లు, షుగర్ ఫ్యాక్టరీని మూసివేయించారని విమర్శించారు. ఉత్తరాంధ్రను గంజాయి సాగు ప్రాంతంగా మార్చేశారని దుయ్యబట్టారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.