బీజేపీ కోసం ప్రచారం చేయడానికి నితిన్, మిథాలీ ఓకే చెప్పారు: ఎంపీ లక్ష్మణ్
- జేపీ నడ్డాతో మిథాలీరాజ్, నితిన్‌లు వేర్వేరుగా భేటీ
- ఈ భేటీల గురించి వివరాలు వెల్లడించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- బీజేపీ కోసం ప్రచారం చేయడానికి ఇద్దరూ అంగీకరించారన్న ఎంపీ
నడ్డాతో భేటీ ముగించుకుని నితిన్ వెళ్లిపోయిన తర్వాత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. నితిన్‌తో పాటు శనివారం మధ్యాహ్నం జేపీ నడ్డాతో భేటీ అయిన మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి సానుకూలత వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. ఈ దిశగా జేపీ నడ్డా చేసిన ప్రతిపాదనకు వారిద్దరూ అంగీకరించారన్నారు. ప్రధాని మోదీ కోసం అవసరమైతే బీజేపీ తరఫున పని చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు చెప్పినట్లు లక్ష్మణ్ తెలిపారు.