'ఖుషి' సినిమాపై దృష్టి సారించనున్న విజయ్ దేవరకొండ
- విజయ్ కు నిరాశను మిగిల్చిన 'లైగర్'
- ఇప్పుడు విజయ్ కు ఒక మంచి హిట్ అవసరం
- దీంతో తదుపరి సినిమాపై దృష్టి సారించాలని నిర్ణయించిన విజయ్
ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాకు సంబంధించి దుబాయ్ లో జరిగే రెండు రోజుల ఈవెంట్ కు విజయ్ హాజరు కాబోతున్నాడు. ఆ తర్వాత 'ఖుషి' రెగ్యులర్ షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. 'లైగర్' డిజప్పాయింట్ చేసిన నేపథ్యంలో, విజయ్ కు ఇప్పుడు ఒక మంచి హిట్ సినిమా అవసరం. అందుకే అన్నింటిని పక్కన పెట్టి తన తదుపరి చిత్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు.