సుజనా చౌదరి స్క్రిప్టును అనురాగ్ ఠాకూర్ చదివారు: మంత్రి జోగి రమేశ్
- టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టును ఠాకూర్ చదివారన్న జోగి
- అనురాగ్‌కి ఏపీ గురించి, ఇక్కడి ప్రభుత్వం గురించి ఏం తెలుసు? అని ప్రశ్న
- మూడేళ్లలో 2 లక్షల మంది యువతకి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి
ఏపీలో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశంపై చర్చకు వస్తారా? అని జోగి రమేశ్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా 2 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా కష్ట కాలంలో కూడా వాలంటీర్లతో సంక్షేమం అందించామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో దోపిడీ చేసింది మీరు పెంచి పోషించిన చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ నేతలకు అసలు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఉందా? అని కూడా ఆయన నిలదీశారు. ఏపీని నిలువునా మోసం చేసిన బీజేపీకి ఏం చూసి ఓటెయ్యాలి? అని ప్రశ్నించిన రమేశ్.. ఏపీలో ఒక్క ఎమ్మెల్యే సీటు కాదు కదా.. వార్డు సభ్యునిగా కూడా బీజేపీ నేతలు గెలవలేరు అన్నారు.