లోక్ సభ స్పీకర్ కుర్చీలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి... ఫొటో ఇదిగో
- రాజంపేట నుంచి ఎంపీగా గెలిచిన వైసీపీ నేత
- ప్యానెల్ స్పీకర్ల జాబితాలో మిథున్ రెడ్డి
- స్పీకర్ చైర్లో కూర్చున్న తన ఫొటోను పంచుకున్న వైనం
2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయా పార్టీలకు చెందిన పలువురు ఎంపీలను లోక్ సభ సెక్రటేరియట్ ప్యానెల్ స్పీకర్లుగా ఎంపిక చేసింది. ఈ జాబితాలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాటి సమావేశాల్లో భాగంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు అలా పక్కకెళ్లిపోగా... సభను నడిపించే అవకాశం మిథున్ రెడ్డికి దక్కింది. ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ చైర్ లో తాను కూర్చుని ఉన్న ఫొటోను మిథున్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లోక్ సభను కాసేపు నడిపించే అవకాశం తనకు దక్కడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.