కేంద్ర అటవీ శాఖ మంత్రితో అంబటి రాంబాబు భేటీ... పల్నాడు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని వినతి
- షెకావత్‌తో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన అంబటి
- కేంద్ర మంత్రి భూపిందర్ యాదవ్‌తోనూ భేటీ
- వరికెపూడిశెల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వాలని వినతి
ఈ సందర్భంగా తన సొంత జిల్లా పల్నాడు జిల్లాలోని వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని రాంబాబు కోరారు. పల్నాడు ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి రాంబాబు విన్నవించారు.