హీరో శ్రీవిష్ణుకు డెంగీ జ్వరం.. ఆసుపత్రిలో చికిత్స!
- గత కొంత కాలంగా జ్వరంతో బాధ పడుతున్న శ్రీవిష్ణు
- జ్వరం తీవ్రత పెరగడంతో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
- వైద్య పరీక్షల్లో డెంగీగా నిర్ధారణ.. పడిపోయిన ప్లేట్ లెట్స్
శ్రీవిష్ణు గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. సాధారణ జ్వరమే అనుకుని కొన్ని రోజుల నుంచి ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే జ్వరం తీవ్రత పెరగడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనను కుటుంబ సభ్యులు చేర్చారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ అని నిర్ధారణ అయింది. ఆయనకు ప్లేట్ లెట్స్ కూడా పడిపోయాయి. దీంతో సంబంధిత చికిత్సను చేస్తున్నారు.