'రామారావు' పైనే ఆశలు పెట్టుకున్న దివ్యాన్ష!
- 'మజిలీ'తో పరిచయమైన దివ్యాన్ష
- తొలి సినిమాతోనే వచ్చిన సక్సెస్
- అయినా దక్కని క్రెడిట్
- 'రామారావు ఆన్ డ్యూటీ'పైనే నమ్మకం
- ఈ నెల 29వ తేదీన విడుదలవుతున్న సినిమా
కానీ అలా జరగలేదు .. దివ్యాన్ష గురించి బయట ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. అందుకు కారణం ఆ సినిమా క్రెడిట్ అంతా కూడా సమంత ఎకౌంట్ కి వెళ్లిపోవడమే. దాంతో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుండిపోయిన దివ్యాన్ష, ఆ తరువాత సినిమాగా 'రామారావు ఆన్ డ్యూటీ' చేసింది.
రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహించాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో తన పాత్రకి మంచి ప్రాధాన్యత ఉందనీ .. మంచి గుర్తింపు వస్తుందని దివ్యాన్ష ఆశపడుతోంది. తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని ఆశిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఏ సినిమా నిలబెడుతుందేమో చూడాలి మరి.