'పొన్నియన్ సెల్వన్' నుంచి ఐశ్వర్యారాయ్ లుక్!
- మణిరత్నం నుంచి మరో భారీ చిత్రం
- చారిత్రక నేపథ్యంలో నడిచే కథ
- నందిని పాత్రలో కనిపించనున్న ఐశ్వర్యరాయ్
- సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల
లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిరత్నం కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందింది. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలెట్టారు.
ఈ కథ చోళరాజుల కాలంలో నడుస్తుంది. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ కీలకమైన పాత్రలో నటించింది. రీ ఎంట్రీ తరువాత ఆమె చేసిన భారీ సినిమా ఇది. ఆమె ఈ సినిమాలో 'నందిని' అనే పాత్రను పోషించిందనే విషయాన్ని తెలియజేస్తూ ఆమె లుక్ ను రిలీజ్ చేశారు. ఐశ్వర్య రాయ్ అదే గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉండటం విశేషం.