చంద్రబాబుతో సినీ నటుడు రాజ్ కుమార్ భేటీ... 2024లో టీడీపీదే విజయమని ప్రకటన
- మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీ
- 1996 నుంచి టీడీపీ కోసం ప్రచారం చేస్తున్నానన్న నటుడు
- చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానని వెల్లడి
2024 ఎన్నికల్లో టీడీపీదే విజయమని రాజ్ కుమార్ తెలిపారు. 1996 నుంచి తాను టీడీపీ కోసం ప్రచారం చేస్తున్నానని ఆయన వెల్లడించారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే చంద్రబాబుతో భేటీ అయ్యానన్నారు. టీడీపీ అభిమానిగా చంద్రబాబును మర్యాదపూర్వకంగానే తాను కలిసినట్లు ఆయన వెల్లడించారు.