రేపటి నుంచి పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీ హౌజ్ కమిటీ విచారణ
- భూమన ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు
- టీడీపీ హయాంలో పెగాసస్‌ను వాడారన్న అంశంపై కమిటీ
- అసెంబ్లీలో సమావేశమైన కమిటీ సభ్యులు
- రేపు హోం శాఖ సహా పలు శాఖల అధికారుల విచారణ
ఈ కమిటీ మంగళవారం అమరావతిలోని అసెంబ్లీలో తొలిసారి భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించిన కమిటీ... రేపు హోం శాఖ సహా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలు శాఖల అధికారులను విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా శాఖలకు కమిటీ నుంచి లేఖలు వెళ్లాయి. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం సేకరించనున్న కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.