వివాదంలో నయనతార.. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచిన కొత్త పెళ్లికూతురు!
- నిన్న ఘనంగా నయన్, విఘ్నేశ్ శివన్ ల వివాహం
- ఈ రోజు శ్రీవారి దర్శనానికి వచ్చిన కొత్త జంట
- వీరిని చూసేందుకు ఎగబడ్డ అభిమానులు
అయితే ఈ సందర్భంగా నయనతార ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచారు. ఆమె భర్తతో పాటు ఇతరులందరూ చెప్పుల్లేకుండానే నడిచారు. నయనతార చెప్పులు ధరించడం వివాదాస్పదమయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.