చిరంజీవి సినీ కార్మికులకు అనవసర హామీలు ఇవ్వడం మానుకోవాలి: కోట శ్రీనివాసరావు
- సినీ కార్మికుల కోసం ఆసుపత్రి కడతానన్న చిరంజీవి
- ఘాటుగా స్పందించిన కోట
- సినీ కార్మికులకు కావాల్సింది ఉపాధి అని వెల్లడి
- డబ్బులు ఉంటే ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోగలరని వ్యాఖ్యలు
ఇలాంటి హామీలు ఇచ్చే బదులు, పని కోసం అలమటిస్తున్న సినీ కార్మికులకు ఉపాధి చూపించాలని హితవు పలికారు. కోట శ్రీనివాసరావు ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
"సినీ కార్మికులు రోజుకు మూడు పూటలు తిండి కోసం అల్లాడుతుంటే చిరంజీవి ఆసుపత్రి కడతానని చెబుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఏదైనా పని కల్పించి ఓ దారి చూపించాలి కానీ... ఇప్పుడు ఆసుపత్రి అవసరమా?... వారికి ఉపాధి కల్పిస్తే నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు... అప్పుడు ఏ ప్రైవేటు ఆసుపత్రిలోనైనా చూపించుకోగలరు. ఏ చర్య అయినా సినీ కార్మికుల సంపూర్ణ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాలి" అని కోట తన అభిప్రాయాలను పంచుకున్నారు.