జోష్టర్ ఫిలిం సర్వీసెస్ ఆరోపణలపై జీవిత స్పందన
- గతంలో గరుడవేగ చిత్రంలో నటించిన రాజశేఖర్
- రూ.26 కోట్లు అప్పు తీసుకున్నారన్న జోష్టర్ సంస్థ
- నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇచ్చిందని వెల్లడి
- ఆరోపణల్లో నిజంలేదన్న జీవిత
ఈ ఆరోపణలపై జీవిత స్పందించారు. తమపై వచ్చిన ఆరోపణల్లో నిజంలేదని అన్నారు. రేపు (శనివారం) 'శేఖర్' సినిమా ప్రెస్ మీట్ ఉందని, ఆ ప్రెస్ మీట్ లో అన్ని వివరాలు చెబుతానని తెలిపారు. పూర్తి ఆధారాలు మీడియా ముందుకు తీసుకువస్తానని, అప్పటివరకు దీనిపై ఎవరూ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం శేఖర్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, గత కొంతకాలంగా రాజశేఖర్ కెరీర్ స్లో అయింది. పెద్దగా హిట్లు కూడా లేని స్థితలో గరుడవేగ చిత్రం రాజశేఖర్ ను మళ్లీ హిట్ బాట పట్టించింది.