'కృష్ణ వ్రింద విహారి' ఫస్టు సింగిల్ కి రిలీజ్ డేట్ ఖరారు!
- అనీష్ కృష్ణ దర్శకత్వంలో 'కృష్ణ వ్రింద విహారి'
- నాగశౌర్య సరసన షిర్లే సెటియా
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
- కీలకమైన పాత్రలో రాధిక
నాగశౌర్య సొంత బ్యానర్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. అనీష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన 'వర్షంలో వెన్నెల్లా' అనే పాటను ఫస్టు సింగిల్ గా వదలనున్నట్టు చెప్పారు.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్స్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. ఇందులో రాధిక ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాగశౌర్యకి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.