ప్రభాస్ 'ఆదిపురుష్' విడుదల తేదీ మారింది!
- శివరాత్రి సందర్భంగా 'ఆదిపురుష్' నుంచి అప్డేట్
- వచ్చే ఏడాది జనవరి 12న త్రీడీ ఫార్మాట్లో సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటన
- బాలీవుడ్ స్ట్రయిట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం
ఈ ప్రకారం, వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న త్రీడీ ఫార్మాట్లో సినిమాను విదుదల చేయనున్నట్టు తెలిపారు. బాలీవుడ్ స్ట్రయిట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ మారిన విషయాన్ని ప్రభాస్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.