వివేకా హత్యలో ఎంపీ అవినాశ్ పాత్ర: లోక్ సభ స్పీకర్‌కు సునీతారెడ్డి లేఖ
- సీబీఐకి వివేకా కుమార్తె వాంగ్మూలం
- అవినాశ్ రెడ్డి పాత్రపై విచారణ చేయించాలని స్పీకర్‌కు లేఖ
- లేఖకు తన వాంగ్మూలాన్ని జత చేసిన సునీతారెడ్డి
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు రాసిన లేఖకు.. తాను ఇచ్చిన వాంగ్మూలం కాపీతో పాటు ఇతర నిందితులు, సాక్షులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలను కూడా ఆమె జత చేయడం గమనార్హం. తన తండ్రి అంటే అవినాశ్ రెడ్డికి గిట్టదని ఆరోపించిన సునీత.. తన తండ్రి హత్యలో అవినాశ్ రెడ్డికి ప్రమేయం ఉందని కూడా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపిన సంగతి తెలిసిందే.