100 కోట్ల క్లబ్ లో చేరిపోయిన 'వలిమై'
- అజిత్ తాజా చిత్రంగా వచ్చిన 'వలిమై'
- యాక్షన్ ప్రధానంగా నడిచే కథ
- తమిళనాట వసూళ్ల వర్షం
- తెలుగులో అంతగా కనిపించని రెస్పాన్స్
తమిళనాట తొలి రోజునే ఈ సినిమా 36 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. వీకెండ్ లో ఈ సినిమా జోరు కొనసాగింది. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 100 కోట్లకిపైగా వసూళ్లను సాధించిందని చెబుతున్నారు. అక్కడ మరికొన్ని రోజుల పాటు ఈ సినిమా హవానే కొనసాగుతుందని అంటున్నారు. ఎందుకంటే దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేవు.
ఇక తెలుగులో కూడా ఈ సినిమాను అదే టైటిల్ తో విడుదల చేశారు. కానీ ఇక్కడ అంతగా రెస్పాన్స్ కనిపించడం లేదు. అందుకు కారణంగా అందరి దృష్టి 'భీమ్లా నాయక్' పై ఉండటమే .. ఆ సినిమాకి హిట్ టాక్ రావడమే. వచ్చేనెల మొదట వారంలో ఈ సినిమాను రిలీజ్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.