త్రివిక్రమ్ - మహేశ్ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!
- ముగింపు దశలో 'సర్కారువారి పాట'
- త్వరలో మళ్లీ సెట్స్ పైకి
- ఏప్రిల్ నుంచి త్రివిక్రమ్ ప్రాజెక్టు మొదలు
- సంగీత దర్శకుడిగా తమన్
త్రివిక్రమ్ తో మహేశ్ చేయనున్న మూడవ సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఏప్రిల్లో పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు. ఈ లోగా మహేశ్ 'సర్కారువారి పాట'ను పూర్తి చేయడం జరిగిపోతుందన్న మాట.
తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. త్రివిక్రమ్ తో 'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' వంటి హిట్ సినిమాలు చేసిన పూజ, మహేశ్ తో కలిసి 'మహర్షి' వంటి హిట్ అందుకుంది. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహేశ్ ఆ తరువాత సినిమాను రాజమౌళితో చేయనున్నట్టు తెలుస్తోంది.