సెకండ్ సింగిల్ వదులుతున్న 'బంగార్రాజు'
- షూటింగు దశలో 'బంగార్రాజు'
- ఆసక్తిని పెంచుతున్న అప్ డేట్స్
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
- డిసెంబర్ 1న సాంగ్ టీజర్ రిలీజ్
ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి చాలా సమయం పట్టింది. కానీ సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి మాత్రం ఎక్కడా ఆలస్యం కాకుండా చకచకా షూటింగును కానిచ్చేస్తున్నారు. అంతేకాదు .. పెద్దగా గ్యాప్ లేకుండా అప్ డేట్స్ వదులుతున్నారు. ఈ జోరు చూసే, ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగుతుందని చెప్పుకుంటున్నారు.
అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, సెకండ్ సాంగ్ టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. డిసెంబర్ 1వ తేదీ ఉదయం 11:12 నిమిషాలకు, 'నా కోసం' అంటూ సాగే సాంగ్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ వదిలారు. చైతూ - కృతి శెట్టి కాంబినేషన్లోని ఈ పోస్టర్ కూడా ఎంతో ఆకట్టుకుంటోంది.
.