దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ కుటుంబంలో విషాదం!
- ఎంజీఆర్ సోదరుడి కుమార్తె లీలావతి మృతి
- ఎంజీఆర్ కు కిడ్నీ దానమిచ్చిన లీలావతి
- ఆమె వయసు 71 సంవత్సరాలు
ఎంజీఆర్ అమెరికాలోని బ్రూక్లిన్ ఆసుపత్రిలో మూత్రాశయ సమస్యలతో చికిత్స పొందుతున్నప్పుడు ఆయనకు లీలావతి ఒక కిడ్నీని దానం ఇచ్చారు. ఆమె ఇచ్చిన కిడ్నీ వల్లే ఎంజీఆర్ ప్రాణగండం నుంచి బయటపడ్డారు. మరికొన్నేళ్లు బతికి, సీఎంగా కొనసాగారు. లీలావతి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రులు, అన్నాడీఎంకే నేతలైన పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంతాపాన్ని ప్రకటించారు.