అఘోర పాత్రలో బాలయ్య విజృంభించారు: శ్రీకాంత్
- బోయపాటి నుంచి 'అఖండ'
- రెండు డిఫరెంట్ లుక్స్ తో బాలయ్య
- ప్రతినాయక పాత్రలో శ్రీకాంత్
- వచ్చేనెల 2వ తేదీన విడుదల
ఈ సినిమాలో పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్రను శ్రీకాంత్ పోషించాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, " బాలకృష్ణ గారి పాత్రలను బోయపాటి అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో ఆయన డైలాగ్స్ మరింత పవర్ఫుల్ గా ఉంటాయి. ముఖ్యంగా అఘోర పాత్రలో ఆయన విజృంభించారు. ఆయన యాక్టింగ్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది.
కథాకథనాల పరంగా .. పాటల పరంగా .. ఈ సినిమా బాలకృష్ణ గారి కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుంది. ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశాలు లభించడం నా అదృష్టం. ఈ సినిమాలో నేను చేసిన విలన్ రోల్ కి కూడా మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.