సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కిచెన్ నుంచి తప్పుకుంటున్న తమన్నా?
- మళ్లీ టాలీవుడ్ కి వస్తున్న స్నేహ ఉల్లాల్
- కథలు నచ్చడం లేదంటున్న రకుల్
* గతంలో కొన్ని తెలుగు సినిమాలలో కథానాయికగా నటించిన స్నేహ ఉల్లాల్ మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ కి వస్తోంది. హాస్యనటుడు సప్తగిరి హీరోగా నటిస్తున్న 'ఎయిట్' సినిమాలో ఓ కీలక పాత్రలో స్నేహ నటిస్తోంది.
* కథలు నచ్చకపోవడం వల్లే తెలుగులో ఎక్కువగా చేయడం లేదని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'కథ నచ్చితే డేట్స్ సర్దుబాటు చేసుకుని మరీ చేస్తాను. అంతేతప్ప, నేను తెలుగులో చేయడం లేదని మాత్రం అనకండి. ఇక హిందీలో వచ్చే ఏడాది నేను నటించిన ఆరు సినిమాలు రిలీజవుతాయి. వాటి రిజల్టును బట్టి కొత్త సినిమాలు ఒప్పుకుంటాను' అని చెప్పింది రకుల్. ఆమె నటించిన 'కొండపొలం' సినిమా ఈ శుక్రవారం రిలీజవుతోంది.