కంగన రనౌత్ నుంచి చాలా నేర్చుకున్నా: అరవింద్ స్వామి
- 'తలైవి' పేరుతో జయలలిత బయోపిక్
- ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న 'తలైవి'
- ఒక అద్భుతమైన అనుభవమన్న అరవింద్ స్వామి
ఈ సందర్భంగా అరవింద్ స్వామి మాట్లాడుతూ, 'తలైవి'లో నటించడం ఒక అద్భుతమైన అనుభవమని చెప్పారు. ఈ సినిమాను కంగన తన భుజాలపై మోశారని కితాబునిచ్చారు. సినిమా షూటింగ్ సమయంలో కంగన నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం సినిమా ఫైనల్ కాపీని చూశానని... ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ నిర్మాత విష్ణు ఇందూరి, బాలీవుడ్ నిర్మాత శైలేశ్ సింగ్ దీనిని సంయుక్తంగా నిర్మించారు.