కేసీఆర్ ఇలాకాలో రేపు షర్మిళ దీక్ష
- గజ్వేల్ నియోజకవర్గంలో షర్మిళ నిరుద్యోగ దీక్ష
- అనంతరావుపల్లిలో కొప్పు రాజు కుటుంబానికి పరామర్శ
- ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న రాజు
గజ్వేల్ మండలం అనంతరావుపల్లిలో ఉద్యోగం రాలేదనే బాధతో కొప్పు రాజు అనే యువకుడు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కుటుంబాన్ని షర్మిల రేపు ఉదయం పరామర్శించనున్నారు. అనంతరం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజ్ఞాపూర్ లో నిరుద్యోగదీక్షలో పాల్గొంటారు.