సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మెహ్రీన్ తొలి కన్నడ సినిమా
- 22న 'ఆచార్య' రిలీజ్ డేట్ ప్రకటన
- మలయాళ సినిమాలో నయనతార
* మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది. చిరంజీవి జన్మదినం ఆగస్టు 22న ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
* కథానాయిక నయనతార మరో మలయాళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. 'ప్రేమమ్' ఫేమ్ ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ హీరోగా రూపొందే చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.